గంగారం ఎక్స్ రోడ్ వద్ద ముంపు గ్రామల ప్రజల మెరుపు ధర్నా
స్పాట్ వాయిస్, కాటారం:గోదావరి పోటెత్తి..కాళేశ్వరం బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి రావడంతో మండలంలోని దామెరకుంట , లక్ష్మి పూర్ గ్రామాలు నీట మునిగి పోవడంతో ఆగ్ర హించిన ప్రజలు అధికారులు పట్టించు కోవడం లేదంటూ గంగారం క్రాస్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి లక్ష రూపాయల పరిహారం, వేరే చోట కొత్త ఇల్లు కట్టించే వరకూ ధర్నా విరమించేది లేదని బాధితులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ధర్నా తో భారీ గా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Recent Comments