16వ తేదీ వరకు ఆగాల్సిందే
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. డేటాబేస్ వర్షన్ అప్‌గ్రేడ్ చేయనున్న నేపథ్యంలో ధరణి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి అప్‌గ్రేడేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయానికి ఈ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ ముగియనుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ధరణి సేవలు అందుబాటులో ఉండవని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉంటే మూడు రోజుల నుంచే ధరణి సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి ధరణి ఓటీపీలు కూడా రావడం లేదని మీ సేవా నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. అంతకంటే ముందు రెండు రోజులు ధరణి పోర్టల్ ద్వారా కేవలం సేల్ డీడ్ మాత్రమే అయ్యాయని చెబుతున్నారు.
నాలుగురోజులు ధరణి బంద్
RELATED ARTICLES
Recent Comments