Sunday, November 24, 2024
Homeతెలంగాణధరణి కొత్త ఆప్షన్లు మీకు తెలుసా..?

ధరణి కొత్త ఆప్షన్లు మీకు తెలుసా..?

ధరణిలో కొత్త ఆప్షన్లు..
సమస్యల పరిష్కారానికి మార్గాలు..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో కొత్త మాడ్యుల్స్‌తో సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం కల్పించిందని మానుకోట కలెక్టర్ కె. శశాంక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పేరు మార్పిడి: ధరణిలో పేరు మార్పిడి అవకాశం కల్పిస్తూ పొరపాటున పట్టాదారుగా వేరే పేరు పడిన, ఆంగ్ల భాషలో అక్షర దోషాలు ఉన్న సవరించుకోవచ్చని తెలిపారు.
భూమి స్వభావం: భూమి స్వభావం పట్టా, సీలింగ్, భూదాన్, అసైన్డ్ వాటివి తప్పుగా నమోదైతే వాటిని సరి చేసుకోవచ్చని తెలిపారు.
భూమి వర్గీకరణ (ల్యాండ్ క్లాసిఫికేషన్): భూమి వర్గీకరణలో మాగాణి, తరి, మెట్ట వంటి వివరాలను మార్చుకోవచ్చని తెలిపారు.
భూమి సంక్రమణ రకం: భూమి ఏ విధంగా సంక్రమించిందో వివరాలు తప్పుగా నమోదైత మార్చుకోవచ్చని తెలిపారు.
భూ విస్తీర్ణం సవరణ (పరిధి దిద్దుబాటు): వాస్తవ విస్తీర్ణం కన్న పాస్ పుస్తకంలో తప్పుగా నమోదైతే సరి చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.
మిస్సింగ్ సర్వే నంబర్/సబ్ – డివిజన్ నంబర్: ఏదైనా సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్ పాస్ పుస్తకంలో నమోదు కనిపించని సందర్భంలో, విస్తీర్ణం తక్కువగా నమోదైతే మార్చుకోవచ్చు అని తెలిపారు. ఇందుకు సంబంధించిన సర్వే నంబర్ వివరాలు ఎంచుకోవాలని అన్నారు.
నోషనల్ ఖాతా నుంచి పట్టాకు బదిలీ: ఏదైనా కారణంతో భూమి 1బీ ఖాతాలో చేరి ఆ తర్వాత పరిష్కారమైన వాటిని పట్టా భూమిగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
భూమి రకం మార్పు: ఏదైనా కారణంతో భూమి రకంలో వ్యవసాయ భూమి వ్యవసాయేతరగా, వ్యవసాయేతర భూమి వ్యవసాయ భూమిగా నమోదైతే సరి చేసుకునే అవకాశం ధరణిలో కల్పించారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధరణి లో పొరపాటులను సరిచేసుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం మీ- సేవా ద్వారా దరఖాస్తుతో పాటు గుర్తింపు కార్డులు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్లలో ఏదైనా రెండు జత చేయాలని, వాటితో పాటు పట్టా దార్ పాత పాస్ పుస్తకం, పట్టాదార్ ధరణి పాస్ బుక్, పట్టాదారు 1బీ, పాత పాస్ బుక్, పహానీ కాపీలు (సేత్వార్ / కస్రా), నూతన పాస్ బుక్, నూతన పహాని కాపీలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు జత చేసి సమర్పించాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments