మావోల ప్రకటన
స్పాట్ వాయిస్, డెస్క్: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ దామోదర్ అలియాస్ చోక్కారావు బతికే ఉన్నాడని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేరకు మవోల సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. త్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతిచెందినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ ఎన్కౌంటర్లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోలేదని ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. సౌత్ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్ తేర్ సమత పేరుతో లేఖ విడుదల చేశారు. పోలీసులు కావాలనే ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మరణించారని వారిలో నలుగురు మావోయిస్టులు కాగా మరో నలుగురు గ్రామస్తులు ఉన్నారని తెలిపింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది. జనవరి 16,17 వ తేదీల్లో 8వేల మంది భద్రతాబలగాలతో 4 గ్రామాలపై దాడులకు పోలీసులు పాల్పడ్డారని చెప్పింది. జనాల్లో అయోమయం సృష్టించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారని విమర్శించింది. పోలీసులు బూటకపు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. దామోదర్, ఇతర సహచరులు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది.
Recent Comments