Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్సీఎం కాళ్లు మొక్కిన మరో ఉన్నతాధికారి

సీఎం కాళ్లు మొక్కిన మరో ఉన్నతాధికారి

చర్చనీయంగా మారిన డీహెచ్  తీరు

 స్పాట్ వాయిస్ , హైదరాబాద్:  సీఎం కేసీఆర్ కాళ్లకు పలువురు ఉన్నతాధికారులు మొక్కడం అత్యంత వివాదాస్పదమవుతోంది. గతంలో సిద్దిపేట కలెక్టర్​ పి.వెంకటరామిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్​ శరత్​ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంగళవారం సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలను హైదరాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు వైద్య శాఖ ముఖ్యులు హాజరయ్యారు. ప్రారంభం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సంచాలకుడు (డీహెచ్) శ్రీనివాస్ కేసీఆర్ కాళ్లు మొక్కారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉన్నతాధికారులు ఇలా కాళ్లు పట్టుకోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత ఉద్యోగులు రాజకీయ నాయకుడి కాళ్లు మొక్కడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments