Friday, September 20, 2024
Homeసినిమాపూనకాలు పుట్టిస్తున్న ట్రైలర్

పూనకాలు పుట్టిస్తున్న ట్రైలర్

స్పాట్ వాయిస్, డెస్క్: గ్లోబర్‌ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుండగా.. దేవర పార్టు-1 సెప్టెంబర్ ‌27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది మూవీ టీం. తాజాగా మంగళవారం సాయంత్రం ట్రైలర్‌ రిలీజ్ చేసింది. స్టన్నింగ్‌గా సాగుతున్న ట్రైలర్‌ అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నట్టు చెప్పకనే చెబుతోంది. దేవరలో బాలీవుడ్ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ భైర రోల్‌లో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలకు ముందే అనార్త్‌ అమెరికా బాక్సాఫీస్‌ వద్ద ప్రీ సేల్స్‌లో రూ.8.2 కోట్ల మార్క్‌ను అధిగమించి అరుదైన ఫీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్‌ విడుదలకు ముందే వేగంగా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిన తొలి ఇండియా సినిమాగా అరుదైన రికార్డు నమోదు చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments