అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హాజరైన ఎమ్మెల్యే అరూరి
స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ, కుమ్మరిగూడెం గ్రామాల్లో సుమారు రూ.36లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లు పూర్తిగా విలీన గ్రామాలతో నిండి ఉన్నాయని, విలీన గ్రామాల అభివృద్ధికి అత్యధిక నిధులు వెచ్చించి పట్టణ వాతావరణం ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
RELATED ARTICLES
Recent Comments