Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఆ.. డిప్యూటీ తహసీల్దార్ పై వేటు

ఆ.. డిప్యూటీ తహసీల్దార్ పై వేటు

ఆ.. డిప్యూటీ తహసీల్దార్ పై వేటు 
ఉత్తర్వులు జారీ చేసిన మేడ్చల్ కలెక్టర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిపై అధికారులు వేటు వేశారు. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు మేడ్చల్ కలెక్టర్ ప్రకటించారు. ఉత్తర్వుల కాపీనీ రెవెన్యూ అధికారులు చంచల్ గూడ జైలులోని నిందితుడికి అందించనున్నట్టు తెలుస్తోంది. గతవారం జూబ్లీహిల్స్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి చొరబడ్డారు. అతన్ని చూసి స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అతడి ఫ్రెండ్ ను సైతం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తన ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ చొరబాటుపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ స్పందించారు. తనకు బాధాకరమైన అనుభవం ఎదురైందని ట్వీట్ చేశారు. తన ఇంట్లోకి ఒక వ్యక్తి చొరబడ్డాడని, తాను వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా తన ప్రాణాలు కాపాడుకున్నానని చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న స్మితా… రాత్రిపూట డోర్లు, తాళాలు చేక్ చేసుకోవాలని, ఎమర్జెన్సీ సమయంలో డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments