Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్బిల్లులు రాలేదని ఉప సర్పంచ్ ఆత్మహత్య..!

బిల్లులు రాలేదని ఉప సర్పంచ్ ఆత్మహత్య..!

అనాథలైన ఇద్దరు కూతుళ్లు
స్పాట్ వాయిస్, కాటారం: పురుగుల మందుతాగి ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చిదినేపల్లి ఉప సర్పంచి బాలినేని తిరుపతి (35) గ్రామంలో గెలుపొందిన అనంతరం పలు అభివృద్ధి పనులను చేశాడు. దాదాపు రూ.11 లక్షలతో రైతు వేదిక నిర్మాణం, వీధి లైట్లు ఏర్పాటు చేయించాడు. రాష్ట్ర ప్రభుత్వ చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే చికిత్స కోసం వరంగల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో తిరుపతి చనిపోయాడు. అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని చిదినేపల్లి సర్పంచ్ అంతర్గం రాజమౌళి తెలిపారు. ఎనిమిది నెలల క్రితం అప్పుల బాధతో తిరుపతి భార్య సరిత సైతం ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో తిరుపతి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. చిదినేపల్లి ఉప సర్పంచి బాలినేని తిరుపతి ఇద్దరు పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments