Sunday, November 24, 2024
Homeతెలంగాణ‘బండి’పై కేటీఆర్ పరువు నష్టం దావా..

‘బండి’పై కేటీఆర్ పరువు నష్టం దావా..

రాష్ర్టంలో పెరిగిన పొలిటికల్ హీట్..
క్షమాపణ.. శిక్ష అని చూస్తున్న ప్రజలు
స్పాట్ వాయిస్, బ్యూరో: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. న్యాయవాదితో బండి సంజయ్‌కి నోటీసులు పంపారు. ఈనెల 11న భాజపా తెలంగాణ అధికారిక ట్విటర్​ అకౌంట్​లో..‘కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే.. కనీసం స్పందించని సీఎం కేసీఆర్..’ అంటూ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్​ ఘాటుగానే స్పందించారు. ఆధారరహిత, ఆరోపణలు ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని సంజయ్​ను కేటీఆర్​ హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేసేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే… వాటిని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని ట్విట్టర్​ వేదికగా మంత్రి కేటీఆర్​ డిమాండ్​ చేశారు. అలా చేయలేని పక్షంలో.. బహిరంగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని మంత్రి హెచ్చరించారు. అయినా ఆధారాలు భయటపెట్టకపోవడంతో శుక్రవారం బండి సంజయ్​కు కేటీఆర్ న్యాయవాది నోటీసులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్​పై నిరాధార ఆరోపణలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రజాజీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్​కు ఆపాదించే దురుద్దేశపూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది పేర్కొన్నారు. 48 గంటల్లో కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments