Thursday, November 21, 2024
Homeతెలంగాణవాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలలే..

వాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలలే..

దర్యాప్తులో పాత్ర ఉన్నట్లు తెలిస్తే అరెస్ట్ చేస్తాం..
పబ్ కు 24 గంటల లైసెన్స్
వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాడిసన్ బ్లూ పబ్‌లో ఉన్నవారు డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు, వినియోగించినట్లు తేలలేదని వెస్ట్​జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. డ్రగ్స్‌ కేసులో పబ్‌లో ఉన్నవారిని బాధ్యులను చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పబ్‌లో ఉన్నవారి పాత్ర ఉందని దర్యాప్తులో తేలితే అరెస్టు చేస్తామని డీసీపీ వివరించారు. డ్రగ్స్‌ కట్టడికి తరచూ సమావేశాలు జరుగుతున్నాయన్న డీసీపీ… వీటి కట్టడికి ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ నిరోధానికి సీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారన్నారు. ప్రత్యేకంగా నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటు చేశారని వెల్లడించారు. రాడిసన్​ పబ్ యాజమాన్యం 24 గంటలపాటు పబ్‌ నిర్వహణకు లైసెన్స్‌ తీసుకున్నారన్నారు. అయితే పబ్‌లో డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం అందడంతో ఆదివారం తెల్లవారుజామున పబ్‌పై టాస్క్‌ఫోర్స్ బృందాల దాడి చేసి 38 మంది మహిళలు సహా 148 మందిని గుర్తించినట్లు చెప్పారు. పబ్‌లో ఐదు ప్యాకెట్లలో 5 గ్రాముల కొకైన్ లభించిందని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments