Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్దసరా సెలవులు 9 రోజులే..

దసరా సెలవులు 9 రోజులే..

 స్పాట్ వాయిస్ , ఓరుగల్లు:  దసరా సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ (రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి) సూచించింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులు సెలవులు ప్రకటించారు. 14 రోజులకు బదులుగా 9 రోజులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. జూలైలో వర్షాలు, సెప్టెంబర్‌ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, దీంతో ఆ సెలవు దినాలను భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ మరో ప్రతిపాదన పాఠశాల విద్యాశాఖ ముందు ఉంచింది. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేయాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో దసరా సెలవులు ఈనెల 26 నుంచి కాకుండా.. అక్టోబర్ 1నుంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments