Thursday, December 5, 2024
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ జిల్లా కేంద్రంగా.. నకిలీ విత్తనాల దందా

వరంగల్ జిల్లా కేంద్రంగా.. నకిలీ విత్తనాల దందా

రూ.2.11 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం
విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాల అరెస్టు
వరంగల్ జిల్లా కేంద్రంగా దందా
డీసీఎం, కారు, రూ. 21 లక్షల నగదు పట్టివేత
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
స్పాట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన పదిహేను మందిని టాస్క్ ఫోర్సు, మడికొండ, ఏనుమాములు పోలీసులు, వ్యవసాయశాఖ విభాగం అధికారులతో సంయుక్తంగాఅరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ. 2.11 కోట్ల విలువ గల ఏడు టన్నుల విడి నకిలీ విత్తనాలు, 9,765 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, డీసీఎం, కారు, రూ.21లక్షల నగదు, నకిలీ విత్తనాల ప్యాకెట్ల తయారీ కోసం వినియోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సంబంధించి వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. ఓ ముఠాలోని సభ్యులు రైతుల నుంచి తక్కువ ధరకు విడిగా విత్తనాలు కొనుగోలు చేసి వాటిని ఈ ముఠాలోని ప్రధాన నిందితులు దాసరి శ్రీనివాసరావు, భాస్కర్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో నిర్వహిస్తున్న విత్తన కంపెనీలకు తరలించి అక్కడ విత్తన శుద్ధి చేసేవారు. శుద్ధి చేసిన నకిలీ విత్తనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన బీజీ 3, ఎచ్ టీ పేర పత్తి విత్తనాలు గా రైతులను నమ్మించి విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలు నాటితే ఎక్కువమార్లు కలుపు తీయాల్సి అవసరం ఉండదని, అలాగే అధికృత డీలర్ల వద్ద విత్తన విక్రయాలకు ఉండవంటూ నమ్మిస్తున్నారు. వివిధ రకాల పేరున్న విత్తన కంపెనీల పేర్లతో ఆకర్షణీయంగాప్యాక్ చేసి వాటిని వరంగల్ నగరానికి తీసుకువచ్చి, ఇక్కడి నుంచే తెలంగాణ, మహరాష్ట్రల్లోని జిల్లాలకు చెందిన విత్తన డీలర్లకు, రైతులకు ఈ ముఠా విక్రయించేవారు.

మరో ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు చేదాం పాండు ప్రభుత్వ అనుమతులు కలిగిన రుషి, శ్రీ గణేష్ విత్తన శుద్ధి కంపెనీ ద్వారా గుజరాత్ రాష్ట్రంలోని నర్మదాసాగర్ కంపెనీ నుంచి దిగుమతైన విత్తనాలను ఈ కంపెనీల ద్వారా ఉప విక్రయ లైసెన్స్ దారుడిగా ఉండి తెలంగాణలోని వివిధ జిల్లాలకు విత్తనాలు వియించేవాడు. ఇదే అదునుగా భావించిన నిందితుడు మరి కొందరితో కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ముఠా సభ్యులు అసలైన నర్మద కంపెనీ చెందిన విత్తన ప్యాకెట్లకు తీసిపోని విధంగా క్యూఆర్ కోడ్, విత్తన తయారీ, గడువు తారీఖులు, క్రమ సంఖ్య, ఎంఆర్ పీలతో కూడిన నకిలీ నర్మద విత్తన ప్యాకెట్లుగా మరికొందరు నిందితుల సహకారంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో విక్రయించేవారు.అయితే పోలీసులకు పక్కా సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్, మడికొండ, ఏనుమాముల, వ్యవసాయశాఖ అధికారులు రెండు బృందాలు ఏర్పడి బుధవారం నిందితులను అరెస్టు చేసి విచారించగా నిందితులు నేరాలన్నీ అంగీకరించారు.

పోలీసులు అరెస్టు చేసిన రెండు ముఠా సభ్యుల్లో దాసరి శ్రీనివాస్ (కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్), చేదాం పాండు (హైదరాబాద్), కొప్పుల రాజేష్ (మంచిర్యాల్), వడిచర్ల సురేందర్ రెడ్డి ( చంద్రపూర్, మహరాష్ట్ర), ఏన్గూడే దిలీప్ (బలార్ష, మహరాష్ట్ర), బోగే సత్యం (మంచిర్యాల), షేక్ అన్జద్ (మంచిర్యాల), ఇందుర్తి వెంకటేష్(మంచిర్యాల), పుట్ట రాజేశం (మంచిర్యాల), చేదాం వెంకటరమణ (హైదరాబాద్), చేదాం నాగరాజు (మహబూబూబ్ నగర్), సుందర్ శెట్టి ఫణీందర్ (బాపట్ల, ఆంధ్రప్రదేశ్), కాల్వ శ్రీధర్ (నాగర్ కర్నూల్ జిల్లా), తాప్తే హనుమంతు (కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్), వేముల అరవింద్ రెడ్డి (హైదరాబాద్) అరెస్టు చేయగా ప్రస్తుతం శివారెడ్డి, భాస్కర్ రెడ్డి, గంప సదాశివ్ పరారీలో ఉన్నారని సీపీ వెల్లడించారు .

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, మామూనూర్ ఏసీపీ కృపాకర్, స్పెషల్ బ్రాంచి ఏసీపీ తిరుమల్, వరంగల్, హన్మకొండ జిల్లాల వ్యవసాయ అధికారులు ఉషాదయాల్, రవీందర్ సింగ్, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ రావు, జనార్థన్ రెడ్డి, అల్లం రాంబాబు, ఎస్.శ్రీనివాస్, వేణు, మహేందర్, ఎస్సైలు దేవేందర్, భూక్యా చందర్, బండారి సంపత్, శరత్ కుమార్, లవనకుమార్, వి.రాజు, శ్రీకాంత్, ఏఏవో సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ప్రభాకర్, రాజేందర్, దయాసాగర్, అబ్దుల్లా, రాజేష్, కిరణ్, భిక్షపతి, రాజు, శ్యాం సుందర్, సురేష్, మహబూబ్ పాషా, కరుణాకర్, శ్రీధర్, విక్రమ్, సతీష్, రమేష్, నరేష్, నవీన్ కుమార్, వి.శ్రీనివాస్, గౌతం, శ్రావణ్ కుమార్, నాగరాజు పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments