ఫ్రెండ్లీ పోలీసింగ్ చేరువైన సేవలు
దామెర ఎంపీపీ కాగితాల శంకర్
మండలంలో ఘనంగా సురక్షా దినోత్సవం
స్పాట్ వాయిస్, దామెర: ఫ్రెండ్లీ పోలీసింగ్ తో తెలంగాణ ప్రజలకు పోలీసు శాఖ సేవలు మరింత చేరువయ్యాయని దామెర ఎంపీపీ కాగితాల శంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దామెర పోలీస్ స్టేషన్ పరిధి ఊరుగొండ, తక్కళ్ళపహాడ్, పులుకుర్తి గ్రామాల్లోని రైతు వేదికల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, ఎంపీటీసీ సభ్యుడు గండు రామకృష్ణ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, నూతన వాహనాలు, డయల్ 100 లాంటి వ్యవస్థాపరమైన మార్పులు చేయడం వల్ల పోలీసులు ప్రజలకు చాలా చేరువ అయ్యారన్నారు.
ఎస్సై ముత్యం రాజేందర్ మాట్లాడుతూ నూతనంగా పోలీసు శాఖలో వచ్చిన మార్పుల వల్ల శాంతి భద్రతలు కాపాడడంతో పాటు, ప్రజలకు దగ్గరయ్యామని అన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పోలీసు శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టాయని, నేరం జరిగిన వెంటనే తక్కువ సమయంలోనే నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు నిఘా నేత్రాలుగా ఉపయోగ పడుతున్నాయని అన్నారు. అనంతరం పోలీసు శాఖ ప్రగతికి సంబంధించిన కర పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాజేశ్వరి ఈశ్వర్, రాజేందర్, అశోక్, ఉపసర్పంచ్ విద్యాసాగర్, ఏఎస్ ఐ రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ చేరువైన సేవలు
RELATED ARTICLES
Recent Comments