Wednesday, April 16, 2025
Homeజిల్లా వార్తలుదేశానికే దిక్సూచి దళిత బంధు

దేశానికే దిక్సూచి దళిత బంధు

దేశానికే దిక్సూచి దళిత బంధు
-దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న పథకం
 లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలి
-ఎమ్మెల్యే అరూరి రమేష్
స్పాట్ వాయిస్ హన్మకొండ రూరల్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొప్ప పథకం దళిత బంధు పథకమని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ పుట్టినరోజు సందర్భంగా హసన్ పర్తి మండలం అనంతసాగర్, చింతగట్టు గ్రామాలకు చెందిన నలుగురు దళిత బంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబం ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దళితుల పట్ల సమాజంలో నెలకొన్న తారతమ్యాలను రూపు మాపడమే దళిత బంధు పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments