Saturday, November 23, 2024
Homeజాతీయంగుడ్ న్యూస్: ఉద్యోగులకు డీఏ పెంపు

గుడ్ న్యూస్: ఉద్యోగులకు డీఏ పెంపు

స్పాట్ వాయిస్, డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిది. కరువు భత్యాన్ని(డీఏను) 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో డీఏ 34 శాతానికి చేరింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన డీఏ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ డీఏ పెంచినట్లు కేంద్రం పేర్కొంది. ఈ నిర్ణయంతో.. 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. గతంలో కరవు భత్యం 31 శాతంగా ఉండగా ఇప్పుడు 3 శాతం పెంపుతో 34 శాతానికి చేరింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments