Wednesday, November 27, 2024
Homeజాతీయంఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు..

ఛార్జ్ షీట్‌లో సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లు
స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక మలుపు తిరిగింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకుంటున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా 17 మంది పేర్లను ప్రస్తావించింది. లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత 10 సెల్ ఫోన్లు మార్చినట్లు ఈడీ ఛార్జ్ షీటులో ఆరోపించింది. సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారిలో కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ గ్రూపు నుంచి రూ.100కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించామని స్పష్టం చేసింది. సమీర్ మహేంద్ర నుంచి విజయ్ నాయర్ భారీగా ముడుపులు అందుకోవడంతో పాటు కవిత సన్నిహితుడైన అరుణ్ పిళ్లై సైతం భారీగా ప్రయోజనం పొందిన విషయాన్ని ప్రస్తావించింది. లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ఫేస్ టైం వీడియోకాల్ ద్వారా సమీర్ మహేంద్రుతో మాట్లాడించినట్లు ఈడీ ఛార్జ్ షీటులో పేర్కొంది. ఈ లావాదేవీల ద్వారా వచ్చిన సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడుకున్నట్లు ఆరోపించింది. లిక్కర్ లైసెన్సులు ఇప్పించేందుకుగానూ ఆప్ నాయకుల తరఫున విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఈడీ చెబుతోంది. సౌత్ గ్రూపులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి ఉన్నారని వారి ప్రతినిధులుగా అభిషేక్ బోయిన్ పల్లి, రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఛార్జ్ షీటులో స్పష్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments