పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
గణపురం పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
స్పాట్ వాయిస్, గణపురం:అకాల వర్షాలు, ఈదురు గాలులకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని గణపురం పీఏసీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, గాలులకు వేల ఎకరాలలో వరి పంట, ఇతర పంటలు సైతం దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టం కారణంగా రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలో పాలుపోని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా యంత్రాంగం మండల పరిధిలోని పంట పొలాలను పరిశీలిన చేసి, పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని కోరారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేసి, మిల్లర్లు రైతులకు సహకరించాలన్నారు. సివిల్ సప్లై అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులకు భరోసా కల్పించాలని ఆయన కోరారు.
Recent Comments