Saturday, April 5, 2025
Homeక్రైమ్ఘోర విషాదం..

ఘోర విషాదం..

ఘోర విషాదం..

ఐదుగురు యువకులు జల సమాధి.. 

మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే

స్పాట్ వాయిస్, క్రైమ్ : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉండగా, మణికంఠ యాదవ్ అనే యువకుడు కారు అద్దాలు పగులగొట్టుకుని సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా తెల్లవారుజామున 4. 30కు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు హైదరాబాద్‌ హయత్‌నగర్కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికితీసిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే కావడం గమనార్హం. ఈ ఘటనపై భూదాన్‌ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments