ఆ తర్వాత బకెట్లో వేసి ఉడకబెట్టాడు..
అనంతరం వేడి చేసి మాసం ముద్దలు చేసాడు..
వెంకట మాధవి హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు..
వెబ్ సిరిస్ లు చూసి దారుణానికి తెగించిన గురుముర్తి
స్పాట్ వాయిస్, డెస్క్: సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్యను హత్య చేసిన గురుమూర్తి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్‌లో రెండు గంటలు వెతికాడు. గతంలో చూసిన వెబ్‌సిరీస్‌ల నుంచి ప్రేరణతో భార్య మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి సాయంత్రానికి మాయం చేశాడు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో కలకలం సృష్టించిన వెంకటమాధవి హత్య కేసు కొలిక్కి వచ్చింది. మాజీ సైనిక ఉద్యోగి గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి బకెట్లో వేడినీటిలో ఉడికించి ఆ తర్వాత సమీపంలోని చెరువులో విసిరేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈనెల 15వతేదీ ఉదయం గురుమూర్తి, వెంకటమాధవి మధ్య గొడవ జరిగినట్లు గుర్తించారు. తలని గోడకు గట్టిగా కొట్టగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మాధవి మరణంతో గురుమూర్తి ఒక వైపు భయం.. మరో వైపు పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలో పడ్డాడు. రెండు గంటలపాటు మృతదేహం ఎలా మాయం చేయాలని ఆన్ లైన్ లో వెతికాడు. ఈక్రమంలో గతంలో చైతన్యపురిలో నర్సు హత్య ఉధంతం గురించి తెలుసుకున్నట్లు సమాచారం. అప్పట్లో నర్సును చంపి మృతదేహాన్ని ముక్కలుగా చేసిన తీరు తెలుసుకోవడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లతో ప్రేరణ పొందాడు.
యాక్సా బ్లేడుతో కటింగ్
నెట్ లో మృతదేహం మాయం గురించి చూసిన గురుమూర్తి ఇంట్లో అందుబాటులో ఉన్న యాక్సా బ్లేడుతో మృతదేహం నుంచి తలను వేరుచేసి మొండేన్ని మూడు ముక్కలు చేశారు. ఆ తర్వాత బకెట్ వేడినీటిలో ముక్కల్ని ఉడకపెట్టిన తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు. ఈ క్రమంలో ముక్కలు మాంసం ముద్దలుగా మారాయి. ఆ సమయంలో అపార్టుమెంట్లు, పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ద్రావణాలు వినియోగించాడు. సాయంత్రం వరకు ఆ పనిపూర్తి చేసి మీర్‌పేటలోని పెద్ద చెరువులో వేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్లు భార్య తల్లిదండ్రులకు ఫోన్‌చేసి మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడిచ్చిన సమాచారంతో చెరువులో మృతదేహం ముక్కల కోసం పోలీసులు వెతికారు. ఎలాంటి ఆనవాళ్లు లభించక ఫోరెన్సిక్, క్లూస్‌టీంలతో ఇంటిని పరిశీలించినప్పుడు గురుమూర్తి నివాసంలో తల వెంట్రుకలు, స్టవ్, వాటర్ బకెట్, హీటర దగ్గర కొన్ని రక్తం, ఆనవాళ్లు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌ను పంపించి విశ్లేషిస్తున్నారు. అవన్నీ వెంకట మాధవి మృతదేహమేనని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. హత్య కేసుపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Recent Comments