ఆపై చెరువులో పడేసి..
అతిదారుణంగా భార్యను హత్య చేసిన భర్త
స్పాట్ వాయిస్, క్రైం: అతికిరాతకం.. దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో చోటు చేసుకుంది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించిన భర్త ఉదంతం కలకలం రేపుతోంది. జనవరి 18న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ, ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని మీర్పేట్పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. వెంటనే గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో అసలు జరిగిన విషయం బయటకు వచ్చింది. తానే భార్య వెంకట మాధవిని హత్య చేసినట్లు అంగీకరించాడు. తరువాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించినట్లు చెప్పాడు. అనంతరం వాటిని ఓ సంచిలో మూట కట్టి జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు తెలిపాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు నిమగ్నమయ్యారు. మృతదేహం ఆనవాళ్ల కోసం జిల్లెలగూడ చెరువులో గాలింపు చేపట్టారు.
ఆర్మీలో రిటైర్డ్ అయ్యి..
గురుమూర్తి గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తూప్రాన్‌పేట్‌లోని దండుపల్లి పరిధిలో నివాసముంటున్నారు. వెంకటమాధవిపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీర్‌పేట సీఐ నాగరాజు తెలిపారు
Recent Comments