Friday, November 22, 2024
Homeక్రైమ్హత్యకు కారణం వివాహేతర సంబంధమే..

హత్యకు కారణం వివాహేతర సంబంధమే..

హత్యకు కారణం 

వివాహేతర సంబంధమే..

అమ్మవారి పేట హత్య కేసు ఛేదించిన పోలీసులు 

 

స్పాట్ వాయిస్ , కాజీపేట: మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారి పేట గ్రామ శివారులో ఉన్న సాయినాథ్ వెంచర్ లో మహిళను హత్య చేసిన నిందితులను పోలీసుల అరెస్టు చేశారు. శుక్రవారం మడికొండ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రతాప్ వివరాలు వెల్లడించారు. వరంగల్ ఉరుసు కరీమబాదకు చెందిన మహమ్మద్ ఇంతియాజ్ ఆటోలను కిరాయికి ఇస్తూ ఉండేవారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం ఇంతియాజ్ చెడుసాహాసాలు మద్యం సేవించడం నచ్చక భార్య షహీన అతడిని వదిలి తల్లి గారి ఇంటికి వెళ్లి పోయింది. అనంతరం ఇంతియాజ్ సిద్దిపేటకు చెందిన గుండెబోయిన నాగలతతో పరిచయం పెంచుకొని కొద్ది సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో కాజీపేటకు చెందిన కుమారి అలియాస్ రాధిక ఇంతియాజ్ భార్య లతకు తెలియకుండా దగ్గరయ్యారు. అక్రమ సంబంధం పెట్టుకుని అదే చనువుతో కుమారి ఇంతియాజ్ ను లక్ష రూపాయలు ఇవ్వమని అడగగా ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ అతని వద్ద డబ్బులు లేక ఇవ్వలేదు, జూన్ 5న కుమారి ఇంతియాజ్ కు ఫోన్ చేసి కాజీపేట దర్గా వద్దకు రమ్మనగా అతను అక్కడికి వెళ్లి కుమారి ని కారులో ఎక్కించుకొని వెళ్లగా తాను లక్ష రూపాయలు ఇవ్వమని మళ్ళీ అడిగింది. అదే కారులో ఇరువురు కలిసి ఉరుసుగుట్ట వద్ద గల సిల్వర్ ట్రీ బార్ వద్దకు వెళ్లగా ఇంతియాజ్ మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉన్న అతని కుమారి తనకు ఇవ్వవలసిన డబ్బులు ఇస్తావా లేదా లేకపోతే నాతో సహజీవనం చేశానని కుటుంబ సభ్యులకు చెబుతాన్నని బెదిరింపులకు గురి చేసింది. అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఇంతియాజ్ కుమారిని ఉరుసు కరీమాబాదులో గల అతని ఇంటి వద్దకు తీసుకువెళ్లగా కుమారి ఇంతియాజ్ భార్య లతతో అతను తనకు లక్ష రూపాయలు ఇస్తానని తనతో సహజీవనం చేశాడని ఇవ్వకుండా మోసం చేశాడంటూ చెప్పడంతో వారి ఇరువురు గొడవ పడ్డారు. జరిగింది, లత, కుమారి తో గొడవపడి చేతులపై కొట్టగా కుమారి కుడి చేతికి గాయమై o ది. ఈ క్రమంలో ఇంతియాజ్ ఇంటికి దిడ్డి మహేష్, అలుపుల వంశీకృష్ణ రాగ వారికి లతా , కుమారిని ఆటోలో తీసుకువెళ్లి అమ్మవారిపేట శివారులోని సాయినాథ్ వెంచర్లో చంపేయండి ఏమైనా అయితే నేను చూసుకుంటాను అంటూ హామీ ఇవ్వడంతో వారు కుమారిని ఆటోలో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి అమ్మవారిపేట శివారులోని సాయినాథ్ గ్రీన్ వెంచర్ లోకి తీసుకువెల్లారు. కుమారి మహేష్ తో గొడవ పడుతుండగా వంశీ ఆటోలోని పానర్ తో కుమారి ఎడమ చెవిపై బలంగా కొట్టగా ఆమె కింద పడిపోయింది, వెంటనే వారు ఇరువురు కలిసి కుమారి తలపై బండరాలు వేయగా తల పగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయమై మృత్తిరాలి భర్త కుమార్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టా రు. మృతురాలు సెల్ఫోన్ ఆధారంగా , సిసి ఫుటేజ్ తో హత్యకు కారకులైన నిందితులను పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రాజా బాబు, దివ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments