సెల్ఫీ తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య యత్నం..
అమ్మనాన్న క్షమించండి..
తప్పు చేస్తున్నానని.. తెలుసు.. చేయని తప్పుకు బలి చేస్తున్నారు..
వీడియో కేసీఆర్ వరకూ వెళ్లేలా చూడండి..
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లా ఏటురు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. తప్పు చేస్తున్నాని , అమ్మ క్షమించండి.. అక్కలను బాగా చూసుకోండి అంటూ పురుగుల మందు తాగేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నూనె రాకేష్ అనే యువకుడు చిన్నబోయినపల్లి గ్రామంలో కరెంటు రాలేదని మూడు రోజుల క్రితం ఏటురు నాగారంలోని పవర్ ఆఫీస్ లో అధికారులను అడిగాడు. అయితే అధికారులు మాత్రం స్టేషన్ లో రాత్రిపూట కరెంటు రాలేదని దౌర్జన్యం చేశాడంటూ పోలీసు స్టేషన్లో పిటిషన్ ఇచ్చినట్లు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతం అయ్యాడు. కేసు అయితే తనకు నేవీ లో జాబ్ పోతుందని , వీసా రాదని మనస్తాపం చెందిన రాకేష్(25) ఆత్మహత్య కు యత్నించాడు. మంగళవారం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. అతడి సెల్ఫీ వీడియో చూసిన గ్రామస్తులు ఘటన స్థలానికి వెళ్లి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తన వీడియో కరంటు అధికారులకు , పోలీసులకు , ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేరేలా చూడండి అంటూ విజ్ఞప్తి చేశాడు.
Recent Comments