గవిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం..
గుండ బ్రహ్మయ్య జాతరలో యువకుల ఘర్షణ ఒకరు మృతి
స్పాట్ వాయిస్ సంగెం: సంగెం మండలం గవిచర్ల గ్రామంలో యువకులు ఘర్షణ పడగా ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకెళితే.. చిర్ర బన్నీ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి గుండ బ్రహ్మయ్య జాతరకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులు దర్శన నిమిత్తం వెళ్ళగా బన్నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సిగరెట్ తాగుతుండగా వేల్పుల సిద్దు అనే యువకుడితో వివాదం చోటుచేసుకుంది. అక్కడికి సిద్దు అన్నయ్య వచ్చి మా తమ్ముడిది తప్పు అని క్షమాపణలు కోరారు. దీనిని సిద్దు మనసులో పెట్టుకొని సిద్దు మేనమామ గుండేటి సునీల్ కి కాల్ చేశాడు. గుండేటి సునీల్ అక్కడికి వచ్చి నా మేనల్లుడిని ఎందుకు బెదిరించారని తన స్నేహితులతో కలిసి చిర్ర బన్నీని కొట్టడం మొదలుపెట్టాడు. అలా సునీల్ తన స్నేహితులు కొట్టడంతో బన్నీ నేలపై కుప్పకూలిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకోగానే వారందరూ బైకులపై ఆటో రిక్షాలో పారిపోయారు. కింద పడిన బన్నీకి పోలీసులు సిపిఆర్ చేసి 108 అంబులెన్స్ లో ఎంజీఎం తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు. ఎస్సై నరేష్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Recent Comments