స్పాట్ వాయిస్ దామెర: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను దామెర పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠాత్మకూర్ గ్రామంలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కమలాపురం మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి విజయ్ కమలాపూర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక లోడ్ చేసుకోని తరలిస్తుండగా పట్టుకున్నారు. అనంతరం పోలీస్ సిబ్బంది ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై కొంక అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Recent Comments