Sunday, April 13, 2025
Homeక్రైమ్కూతురును గొడ్డలితో నరికిన తండ్రి..

కూతురును గొడ్డలితో నరికిన తండ్రి..

కూతురును గొడ్డలితో నరికిన తండ్రి..

స్పాట్ వాయిస్, మంథని : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో గుండ్ల సదానందం అనే వ్యక్తి తన కన్న కూతురును గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆ తర్వాత అదే గొడ్డలితో మరో దుకాణదారుడిపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అయితే నిందితుడిని పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. నిందితుడిని తామే శిక్షిస్తామంటూ పోలీసు వాహనానికి ముళ్ల కంపలు అడ్డం వేశారు స్థానికులు. ఈ క్రమంలో పోలీసులతో గ్రామస్థులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, నిందితుడు సదానందం గతంలో తన భార్యను ఉరివేసి చంపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments