దుప్పి మాంసం పట్టివేత
స్పాట్ వాయిస్, ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం మండలం అంబేద్కర్ కాలనీలో దుప్పి మాంసాన్ని విక్రయిస్తుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..ఏటూరునాగారంలో అటవీ జంతువుల మాంసం విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం తో డీఆర్వో నరేందర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి దుప్పి తల, కాళ్ళు, మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments