జనగామ జిల్లాలో దారుణం
స్పాట్ వాయిస్, జనగామ: జనగామ జిల్లాలో రూ.300 కోసం ప్రాణం తీశారు. జిల్లాలోని వెంకన్న అనే వ్యక్తి కోతిని ఆడిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకన్నను అతని స్నేహితులు రూ.300 అడిగారు. అతను ఇవ్వకపోవడంతో వారి మధ్య గొడవ జరిగింది. వివాదం ముదరడంతో జిల్లాలోని వినాయక బార్ వెనకాల వెంకన్నను బండ రాయితో కొట్టి నిప్పు అంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
Recent Comments