ఘోర రోడ్డు ప్రమాదం..
అన్నాచెల్లి మృతి..
హన్మకొండ జిల్లాలో విషాదం..
స్పాట్ వాయిస్, క్రైమ్: ఘోర రోడ్డు ప్రమాదం అన్న చెల్లిని మింగేసింది. ఈ ఘోర ఘటన కరుణాపురం, రాంపూర్ మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సుమిత్ రెడ్డి, పూజిత రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ధర్మసాగర్ పోలీసులు మృతదేహలను ఎంజీఎం మార్చురీకి తరలించారు.
Recent Comments