వీధి కుక్కల దాడి..
బాలుడి మృతి..
స్పాట్ వాయిస్, కాజీపేట: హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాజీపేట పట్టణ పరిధి రైల్వే ఆవరణలోని నూతన చిల్డ్రన్ పార్క్ వద్ద ఆరేళ్ల బాలుడిని కుక్కలు కరిచాయి. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, కాజీపేట పట్టణ పరిధి 47, 62, 63 డివిజన్లలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయని స్థానికులు భయపడుతున్నారు.
దీంతో సాయంకాలం చిన్నారులు, వృద్ధులు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారని వాపోతున్నారు. ప్రజలు ఉదయం మార్నింగ్ వాక్ చేయాలన్న ప్రాణాలతో చెలగాటమేనని, ఒక్కరు కనిపిస్తే చాలు వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల నుండి ఇప్పటి వరకు ఎనిమిది మందిని వీధి కుక్కలు కరిచాయని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని కాజీపేట పట్టణ వాసులు
కోరుతున్నారు.
Recent Comments