Saturday, November 23, 2024
Homeక్రైమ్యువకుల వేధింపులు.. యువతి ఆత్మహత్య..

యువకుల వేధింపులు.. యువతి ఆత్మహత్య..

యువకుల వేధింపులు..
యువతి ఆత్మహత్య..

స్పాట్ వాయిస్ , దామెర: ఆకతాయిల వేధింపులకు యువతి బలైంది. అసభ్య మెసేజ్ లు భరించలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన హన్మకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దామెర మండలంలోని ల్యాదెల్ల గ్రామానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అసభ్య మెసేజ్ లతో లైంగిక వేధింపుల కు పాల్పడ్డారు. వారి చేష్టలు భరించలేక మనోవేదనకు గురై ఈ నెల 18న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించారు. యువతి ఎంజీఎంలో చికిత్స పొందుతూ  సోమవారం రాత్రి మృతి చెందింది. లైంగికంగా వేధించిన విషయం ఆదివారం యువతి తన కుటుంబ సభ్యులకు తెలుపగా యువతి తల్లి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దామెర ఎస్సై హరిప్రియ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments