గణపురం ఎస్సై అభినవ్
సీసీ కెమెరాల పై అవగాహన
స్పాట్ వాయిస్, గణపురం: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని గణపురం ఎస్సై అభినవ్ అన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు, వ్యాపారస్తులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం చెల్పూర్ గ్రామంలో సీసీ కెమెరాల ఉపయోగాలపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అభినవ్ మాట్లాడారు. రోజు రోజుకూ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామానికి చాలా లాభాలు ఉన్నాయన్నారు. నేరాలను అదుపు చేయడంతో పాటు రాత్రిపూట దొంగతనాలను నివారించవచ్చన్నారు. అలాగే వాహనాల రాకపోకలను గుర్తించవచ్చి పేర్కొన్నారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యే వీడియో ఫుటేజీలతో ముఖ్యమైన కేసులను ఛేదించవచ్చని చెప్పారు. గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే అందులో కొన్ని పని చేయడం లేదని తెలిపారు. వాటి స్థానంలో నూతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి గ్రామస్తుల సహకారం అవసరమని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు, ఉప సర్పంచ్ రజియా, కోల రవీందర్, సంపత్ రావు, హనుమంతరావు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
RELATED ARTICLES
Recent Comments