ఎస్సై అభినవ్
నగరంపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు
స్పాట్ వాయిస్, గణపురం: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమని ఎస్సై అభినవ్ అన్నారు. మండల పరిధిలోని నగరంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి పనిచేయని రెండు కెమెరాలను మరమ్మతులు చేయడంతో పాటు నూతనంగా రెండు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో రెండు సీసీ కెమెరాలు గ్రామానికి వచ్చే దారిలో మరో రెండు కెమెరాలు వెళ్లే దారిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను అదుపు చేయడంతో పాటు రాత్రిపూట దొంగతనాలను నివారించవచ్చన్నారు. అలాగే వాహనాల రాకపోకలను గుర్తించవచ్చన్నారు. అసాంఘిక శక్తుల అరాచకాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యే వీడియో ఫుటేజీలతో ముఖ్యమైన కేసులను ఛేదించవచ్చన్నారు. నగరాల్లో, పట్టణాలు, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెరిగిందన్నారు. చాలా మంది ఇండ్లలో సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
RELATED ARTICLES
Recent Comments