కరెంటు షాక్ తో మహిళా రైతు మృతి
కన్నీరు పెట్టిన వేద నగర్
స్పాట్ వాయిస్, నల్లబెల్లి :మండలంలోని గోవిందాపూర్ శివారు వేదనగర గ్రామంలో శుక్రవారం కరెంట్ షాక్ తో మహిళ రైతు మృతి చెందిoది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వేద నగర్ గ్రామానికి చెందిన బైకానీ.రాజు -కవిత (35) దంపతులు వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంటలకు మందు పిచికారి చేసే చార్జింగ్ పంపు ఇంట్లోనే చార్జింగ్ పెట్టారు. శుక్రవారం ఉదయాన్నే చార్జింగ్ వైరు ను కవిత తీస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు పదవ తరగతి బిడ్డ 8వ తరగతి చదువుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు గ్రామస్తులు కన్నీటి పర్యంతం అయ్యారు. మృతురాలు భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై నైనాల నగేష్ పేర్కొన్నారు.
Recent Comments