రూ. 80 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు
స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం) : ఖానాపురం మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ సందర్భంగా రూ. 80 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దుగ్గొండి సీఐ కిషన్ కథనం ప్రకారం.. ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన కుసుమ రాధమ్మ ఈ నెల 14 వ తేదీన కుమారుడు రాజకుమార్ తో కలిసి వేములవాడ రాజరాజేశ్వరుడి దర్శనానికి వెళ్లి తిరిగి 16వ తేదీన ఇంటికి రాగా, ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించింది. అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, ట్రంకు పెట్టెలో దాచి ఉంచిన రూ. 80 వేల విలువైన 11 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి పట్ట గొలుసులు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. ఈ విషయమై వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ కిషన్, ఎస్సై మాధవ్ ఘటనా స్థలానికి పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
RELATED ARTICLES
Recent Comments