Saturday, May 24, 2025
Homeక్రైమ్మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

స్పాట్ వాయిస్,సంగెం: మనస్థాపనతో మహిళ ఆత్మహత్య చేసుకున్న  సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది.ఎస్సై భరత్ తెలిపిన వివరాల మేరకు.. ఆశాలపల్లి గ్రామంలో దండు సమ్మయ్య కు ముగ్గురు అన్నదమ్ములు. వారి ఇంటి స్థలం విషయంలో తమ్ముడు సదయ్యకు కొత్తగా ఇల్లు నిర్మించడానికి పిల్లర్స్ పోసే క్రమంలో దండు వీరస్వామి వైపు ఉన్న హద్దులు సమానంగా జరపాలని అడగారు. వీరస్వామి భార్య వసంత, తమ్ముడు సదయ్య, స్వరూప హద్దురాయిని సమానంగా జరపమని  రమాదేవి 48 తో గొడవ పడింది. ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో దోమకాటు మందు తాగి స్పృహ కోల్పోయి ఉండడంతో స్థానికులు గుర్తించి ఎంజీఎంకు తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. రమాదేవి మృతికి కారకులైన దండు వీరస్వామి, వసంత, సదయ్య, స్వరూప పై కేసు నమోదు చేయాలని మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై భరత్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments