Saturday, May 24, 2025
Homeలేటెస్ట్ న్యూస్నర్మెట సీఐ, ఎస్సై సస్పెన్షన్..

నర్మెట సీఐ, ఎస్సై సస్పెన్షన్..

ఉత్తర్వులు జారీ చేసిన సీపీ రంగనాథ్
స్పాట్ వాయిస్, క్రైం: భూసంబంధిత విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి, భూక‌బ్జాదారుల‌కు అండగా నిలిచిన జ‌న‌గామ జిల్లా న‌ర్మెట సీఐ నాగబాబు, నర్మెట ఎస్సై అనిల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శ‌నివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూతగాదా విషయంలో మూడేళ్లుగా బాధితుల స్వాధీనంలో ఉన్న భూమిని కేవలం ధరణి పోర్టల్‌లో ఉన్నదనే సాకును చూపిస్తూ భూ కబ్జాదారులకు బాధితుల భూమిని ఇప్పించేందుకు స్థానిక సీఐ, ఎస్సై కబ్జాదారులకు సహాయసహ‌కారాలు అందజేయడంతో పాటు బాధితులపై అక్రమంగా కేసులు నమోదు చేయడంతో బాధితులు సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆయన పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులతో విచారణ జ‌రిపించారు. స్థానిక ప్రజల వాంగ్మూలం తీసుకున్నారు. ఈ విచార‌ణ‌లో బాధితులను ఇబ్బందులకు గురిచేయడం, భూ కబ్జాదారులకు సహకరించినట్లు తేలడంతో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments