Friday, November 22, 2024
Homeటాప్ స్టోరీస్మేము నమ్ముతున్నాం..

మేము నమ్ముతున్నాం..

ప్రీతిది ఆత్మహత్యే..

సీపీ అన్ని వివరంగా చెప్పారు.. 

పోస్టుమార్టం రిపోర్ట్ చూపించ లేదు..

నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగిందనే అనుకుంటున్నాం.. 

మీడియాతో ప్రీతి తండ్రి, సోదరుడు

57 రోజుల అనంతరం వీడిన మిస్టరీ..

ఎట్టకేలకు మెడికో డాక్టర్ ప్రీతి డెత్ కేసు మిస్టరీ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరిలో వరంగల్ ఎంజీఎం దవాఖానలో డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికెళ్లిన ప్రీతి సుమారు ఇరవై రోజుల పాటు మృత్యువుతో పోరాడి హైదరాబాద్ లో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అయితే తమ కూతురుది హత్యేనని, మరణానికి కారకులైన ప్రతి ఒక్కరికి శిక్షపడాల్సిందేనని ప్రీతి తల్లిదండ్రులు ఓవైపు, ఇతరత్రా సంఘాల ఆందోళనలు మరోవైపు పెరగడంతో రాష్ట్రమంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే తప్ప, ఏమీ చెప్పలేమన్న పోలీసులు శుక్రవారం ఆమెది ఆత్మహత్యేనని ప్రకటించడం, శనివారం ప్రీతి తండ్రి, సోదరుడు సీపీ ఏవీ రంగనాథ్ ను కలిసి అరగంటకు పైగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. అనంతరం వారు మీడియాతో ప్రీతిది ఆత్మహత్యేననే క్లారిటీ వచ్చిందని, పోలీసుల విచారణపై తమకు అపారమైన నమ్మకం ఉందని తెలియజేయడంతో కేసు కొలిక్కి వచ్చినట్టు అయింది.

స్పాట్ వాయిస్, హన్మకొండ క్రైమ్

రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రీతిది హత్యా..? ఆత్మహత్యా..? అన్న సస్పెన్షన్ కు తెరపడింది. శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం రిపోర్టర్ తో కేసు కొలిక్కి వచ్చేసింది. ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ తేల్చేశారు. ఇక శనివారం సీపీని ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ కలిశారు. ఈ సందర్భంగా.. ప్రీతి మృతికి సంబంధించి తమకున్న అనుమానాలు, అభిప్రాయాలను సీపీ రంగనాథ్‌తో చర్చించారు. కేసు ప్రస్తుత స్థితి పూర్వపరాలను ఈ సందర్భంగా సీపీ ప్రీతి కుటుంబ సభ్యులకు వివరించారు. సుమారు అరగంటకుపైగా సీపీతో చర్చ జరిపిన అనంతరం ప్రీతి తండ్రి మీడియాతో మాట్లాడారు.

మేం నమ్ముతున్నాం.. 

ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నట్లు ఆమె తండ్రి నరేందర్ తెలిపారు. సిరంజి దొరికిందని..ప్రీతి శరీరంలో విష పదార్థాలు కూడా ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపెట్టలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షపాతంగా జరుగుతుందని తాము నమ్ముతున్నామన్నారు. చార్జ్ షీట్ లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. కచ్చితంగా ఇది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు.అంతేకాదు ఇదంతా పక్కా పథకం ప్రకారమే జరిగిందని కూడా హత్యేనని చెప్పారు.

డెత్‍ డ్యూ టు పాయిజన్‍

కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ధరావత్‍ ప్రీతి ఆత్మహత్య చేసుకునే చనిపోయినట్లు వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ ఏవీ రంగనాథ్‍ చెప్పారు. మెడికో ప్రీతి మృతి కేసుపై శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. ప్రీతి మరణానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందని, అందులో ‘డెత్‍ డ్యూ టు పాయిజన్‍’ అని తేల్చినట్లు వెల్లడించారు. పోలీసుల విచారణలోనూ దాదాపు అదే విషయం తేలిందన్నారు. ఫిబ్రవరి 22న ఎంజీఎంలో ప్రీతి అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట సిరంజీ దొరికిన విషయాన్ని తాము అప్పుడే చెప్పామన్నారు. కానీ అక్కడ నీడిల్‍ దొరకకపోవడం వల్లే కన్‍ఫ్యూజన్ ఏర్పడిందన్నారు. దగ్గర్లోని డస్ట్ బిన్ లో చాలా నీడిల్స్ ఉండటంతో ప్రీతి ఇంజక్షన్ తీసుకునేందుకు వాడిన నీడిల్ ను సేకరించలేకపోయామని సీపీ చెప్పారు. దాదాపుగా అప్పుడే ప్రీతిది ఆత్మహత్యేనని 99 శాతం నిర్ధారణకు వచ్చామన్నారు. ఆమె సక్సీనైల్ కోలిన్‍ అనే ఇంజక్షన్‍ తీసుకున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. అయినా, ప్రీతి ఆత్మహత్యకు సీనియర్‍ స్టూడెంట్‍ డాక్టర్ సైఫ్‍ ప్రధాన కారణమన్నారు. అతని ర్యాగింగ్‍ వల్లే మానసిక ఒత్తిడికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. సైఫ్‌పై ముందుగా పెట్టిన కేసుల్లో ఐపీసీ 306తో పాటు అట్రాసిటీ కేసులు కొనసాగిస్తాం. డాక్టర్‌ సైఫ్‌ వేధించినట్లు ఆధారాలు ఉన్నాయి. అతనే ప్రధాన నిందితుడు. త్వరలో కేసుకు సంబంధించి కోర్టులో చార్జిషీట్‌ వేస్తాం’ అని చెప్పారు.

సంచలన కేసుగా.. 

ప్రీతి మృతి కేసు ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆత్మహత్యగా ముగిసింది. 57 రోజుల తర్వాత పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఆమెది ఆత్మహత్య అని నిర్ధారించారు. ఈ కేసు తొలిరోజు నుంచే మిస్టరీగానే కొనసాగింది. ఆమెను హత్య చేశారనే ప్రచారం జరిగింది. తమ కూతురి శరీరంపై గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పారు. ఫిబ్రవరి 26న ప్రీతి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తర్వాత నెల రోజులు గడిచినా ఏమీ తేల్చపోవడంతో పోలీసులపైనా ఆరోపణలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో ప్రీతి మృతికి ఫెంటానిల్‌ కారణమని, ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని సీపీ తేల్చిచెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments