పంది అడ్డురావడంతో అదుపు తప్పిన బైక్
– భార్యాభర్తలకు తీవ్రగాయాలు
-చెల్పూర్ లో ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: చెల్పూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి వివరాలిలా వున్నాయి.. గణపురం మండల చెల్పూర్ పరిధిలోని పాపయ్యపల్లికి చెందిన తాకంటి కుమార్ బైక్ పై తన భార్య లతతో కలిసి ఆదివారం రాత్రి చెల్పూర్ సెంటర్ వద్దకు వెళుతున్న క్రమంలో సినిమా టాకీస్ సమీపంలో ఆకస్మికంగా పంది అడ్డు వచ్చింది. దీంతో బైక్ అదపు తప్పింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తల ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు భార్యాభర్తలిద్దరిని చికిత్స కోసం 108 వాహనంలో హన్మకొండకు తలించారు.
Recent Comments