Thursday, April 17, 2025
Homeక్రైమ్ఐలోనిలో చోరీ..

ఐలోనిలో చోరీ..

మహిళా మెడలోని చైన్ కొట్టేసిన దొంగలు..
స్పాట్ వాయిస్ హన్మకొండ రూరల్: ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ ఆవరణలో దొంగలు చేతివాటం చూపించారు. ఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. భువనగిరి జిల్లాకు చెందిన గండు వసంత అనే మహిళ తన కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చింది. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మల్లన్న ఆలయ ప్రాంగణంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద యాదాద్రి  గుర్తుతెలియని దుండగులు వసంత మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును లాక్కొని వెళ్లిపోయారు. దీంతో మహిళా స్థానిక పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆలయ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల ఫొటోలను గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. దుండగుల ఆచూకీ లభిస్తే ఫోన్ నెంబర్ లకు 8712685030, 8712685244 సమాచారం అందించాలని ఎస్సై వెంకన్న తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments