స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ స్థలం కోసం ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘోర ఘటన మండలంలోని బుర్రకాయల గూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గణపురం మండలం బురకాయల గూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం స్థానిక తహసీల్దార్ సాయిని సతీష్ కుమార్ 10 గుంటల స్థలాన్ని కేటాయించగా శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో గురువారం శిలాఫలకం ఏర్పాటు చేస్తుండగా ఆ స్థలం మాది అంటూ ఎంపీటీసీ కాలియా సాగర్, ప్రవీణ్, శ్రీ బాబు, కాలియా గోపాల్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న తుమ్మల నాను, తుమ్మల రవీందర్ పై కత్తులతో దాడి చేశారు. దీంతో వారికి బలమైన గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాయాల పాలైన ఇద్దరిని 108లో భూపాలపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భూపాలపల్లి జిల్లాలో కత్తుల దాడి..
Video Player
00:00
00:00
RELATED ARTICLES
Recent Comments