Sunday, November 24, 2024
Homeక్రైమ్పెండ్లికి ఒప్పుకోలేదని గొంతు కోసాడు..

పెండ్లికి ఒప్పుకోలేదని గొంతు కోసాడు..

ప్రేమోన్మాది ఘాతుకం
యువతి గొంతు కోసిన యువకుడు
పరిస్థితి విషయం.. ఆస్పత్రికి తరలింపు
స్పాట్   వాయిస్, కాజీపేట: హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో ప్రేమోన్మాది ఘాతుకం కలకలం రేపింది. తనను కొంతకాలంగా దూరం పెడుతున్నదని కక్ష పెంచుకున్న యువకుడు యువతిపై కత్తితో దాడిచేసి, తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొద్ది రోజులుగా శ్రీనివాస్ అనే యువకుడు అఫ్జల్ బేగం అనే యువతిని ప్రేమ పేరిట వేధిస్తు్న్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువకుడిని స్టేషన్ కు పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి మరింత పగ పెంచుకున్న శ్రీనివాస్ కత్తితో యువతి గొంతు కోశాడు. గమనించిన యువతి బంధువులు ఆగ్రహంతో శ్రీనివాస్ కు దేహశుద్ధి చేశారు. అయితే యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments