విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడికి యత్నించాడు. వీకెండ్ కావడంతో శుక్రవారం రాత్రి యూనివర్సిటీలో పార్టీ నిర్వహించారు. ఇందులో విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఇదే పార్టీలో పాల్గొన్న థాయిలాండ్ విద్యార్థినిపై ఓ ప్రొఫెసర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో ఆమెను కొట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Recent Comments