Monday, September 23, 2024
Homeక్రైమ్కూతురితో కలిసి బావిలో దూకిన తల్లి

కూతురితో కలిసి బావిలో దూకిన తల్లి

కూతురితో కలిసి బావిలో దూకిన తల్లి
దామెరలో విషాదం
స్పాట్ వాయిస్ , దామెర: వ్యవసాయ బావిలో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఊరుగొండలో చోటు చేసుకుంది.ఎస్సై హరిప్రియ కథనం ప్రకారం మండలం లోని ఊరుగొండ, పసరగొండ క్రాస్ వద్ద గల వ్యవసాయ బావిలో పడి ఆత్మకూరు మండలం హౌజూ బుజూర్గు గ్రామానికి చెందిన నిమ్మల ఆమని(24),కూతురు సుమారు 6 నెలల పాప ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంబంధిత ప్రదేశానికి చేరుకొని బావిలో నుంచి మృతదేహాలను స్థానికుల సాయంతో బయటకు తీసి ఎంజీఎం ఆసుపత్రికి తరలించామన్నారు. వీరి ఆత్మహత్య కు గల కారణం తెలియాల్సి ఉందన్నారు. ఫిర్యాదు అందిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుతుందని ఎస్సై హరిప్రియ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments