ఇన్ ఫార్మర్ నెపంతో దారుణ హత్య
మావోల దుశ్చర్య
స్పాట్ వాయిస్ , వాజేడు: వెంకటాపురం వాజేడు ఏరియాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఇన్ ఫార్మర్ అనే నెపంతో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వెంకటాపురం మండలం కొండాపురం గ్రామానికి చెందిన. సబ్క గోపాల్ (45)ను అతిదారుణంగా హత్యచేశారు. అలాగే మృతదేహం వద్ద ప్రజావ్యతిరేక పోలీస్ ఇన్ఫార్మర్లను ఖండించండి అంటూ ఓ లేఖను వదిలి వెళ్లారు. ఈ లేఖలో పోలీసులు అమాయక గిరిజన వాసులను ప్రలోభ పెట్టి, బెదిరించి మావోయిస్టుల జాడ చెప్పాలని వేధిస్తున్నారని మావోలు తమ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రజల మనుషులుగా చెప్పుకునే మావోయిస్టుల ఇలా దారుణానికి పాల్పడటంతో కొండాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Recent Comments