Sunday, November 24, 2024
Homeజాతీయంటీమ్ వర్క్ తో మంచి ఫలితాలు అందిద్దాం..

టీమ్ వర్క్ తో మంచి ఫలితాలు అందిద్దాం..

టీమ్ వర్క్ తో మంచి ఫలితాలు అందిద్దాం..
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
భద్రకాళీ అమ్మవారి దర్శించుకున్న సీపీ
క్షేత్ర స్థాయిలో పలు విభాగాల పరిశీలన
సిబ్బంది క్రమశిక్షణ అతిక్రమిస్తే సహించేది లేదని స్పష్టం
స్పాట్ వాయిస్, క్రైమ్ : అందరం జట్టుగా పనిచేసి వరంగల్ పోలీస్ కమిషనరేటకు చక్కని ఫలితాలను అందిద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సిబ్బందికి సూచించారు. సీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్ ఆదివారం ఉదయం ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం సీపీకి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత కమిషనరేట్ కార్యాలయంలోని విధులు నిర్వహించే వివిధ పోలీస్ విభాగాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇందులో ఆర్ముడ్ రిజర్వ్ విభాగంతో పాటు హోంగార్డ్స్, ఎంటీ కమాండ్ కంట్రల్, బాంబ్ డిస్పోజల్ విభాగం, సీసీఆర్బీ, ట్రాఫిక్ కౌన్సెలింగ్ సెంటర్, కంట్రోల్ రూం, డాగ్ స్కాడ్, ఆర్ ఐ, కన్స్యూమర్ స్టోర్స్, స్పెషల్ బ్రాంచ్, వైద్యశాలతో పాటు డీసీపీలు, అదనపు డీసీపీలు, ఇతర పోలీస్ అధికారుల కార్యాలయా, నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ భవనాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది విధులను సంబంధిత అధికారులను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆర్ముడ్ విభాగం సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఏదైనా సమస్యతో వుంటే తనను ఎప్పుడైనా కలవవచ్చని, లేకుటే సంక్షిప్త మేసేజ్ ద్వారా కూడా తమ సమస్యను వివరించవచ్చాన్నారు. ముఖ్యంగా సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, క్రమశిక్షణ అతిక్రమిస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. సిబ్బంది సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానని, ముఖ్యంగా సిబ్బందికి విశ్రాంతి కల్పించడంతో పాటు వారు తెలియజేసే సమస్యలపై స్పందిస్తానన్నారు. తనిఖీల్లో ఏఆర్ అదనపు డీసీపీలు సంజీవ్, సురేష్ కుమార్, ఏసీపీలు నాగయ్య, అనంతయ్య, సురేందర్, స్పెషల్ బ్రాంచి ఏసీపీ తిరుమల్, ఆర్ఐలు నగేష్, భాస్కర్, చంద్రశేఖర్ తో పాటు సంబంధిత విభాగాలకు చెందిన ఇన్ చార్జిలు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments