* కేసు వాపస్ తీసుకుంటేనే అంత్యక్రియలు చేస్తా
* భీష్మించుకు కూర్చున్న భార్య
* చెల్లెళ్లు, సోదరుడి వల్లే ఆత్మహత్య అంటూ ఆరోపణ
స్పాట్ వాయిస్, బ్యూరో: మారుతున్న కాలంలో ఆస్తులకు ఇచ్చే విలువ కూడా బంధాలకు ఇవ్వడం లేదు. ఆస్తికోసం తల్లిదండ్రులు, తోడబుట్టినోళ్లపైనే కేసులు వేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది. తండ్రి ఆస్తి కోసం కోర్టులో చెల్లెళ్లు, సోదరుడు కేసు వేస్తేనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని.. కేసు విత్ డ్రా చేసుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తానని ఓ భార్య భీష్మించుకుని కూర్చుంది. దీంతో మూడు రోజులుగా ఆమె భర్త శవం మార్చురీలోనే ఉంది. ఈ దారణమైన ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చోటుచేసుకుది. గ్రామానికి చెందిన చీరిక హనుమంత రెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డికి 7.24 ఎకరాల భూమి ఉంది. అయితే తండ్రి ఆస్తిలో తన తమ్ముడితో హనుమంతరెడ్డికి తగాదాలు ఉన్నాయి. దీంతో తన తమ్ముడు, చెల్లెళ్లు కలిసి ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విషయంలో తరచూ గొడవలు జరుగుతండటంతో మనస్తాపానికి గురైన హనుమంతరెడ్డి పంతంగిలోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తన భర్త మరణానికి వారిద్దరే కారణం అని.. కోర్టులో కేసు ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు చేస్తానంటూ ఆమె భీష్మించుకుని కూర్చుంది. మూడు రోజులుగా పెద్ద మనుషులు నచ్చజెప్పినా వినట్లేదు. ఇక చివరకు బంధువుల ఒత్తిడితో మంగళవారం కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో అంత్యక్రియలకు చేశారు.
Recent Comments