Saturday, April 19, 2025
Homeతెలంగాణగడువన్నా పెంచాలె.. ఎన్నికలన్నా పెట్టాలె..

గడువన్నా పెంచాలె.. ఎన్నికలన్నా పెట్టాలె..

కోర్టుకెక్కిన సర్పంచులు
స్పాట్ వాయిస్, బ్యూరో: గ్రామ పంచాయతీల్లో పాలకవర్గం పాలన నేటితో ముగియనుంది. రాష్ట్రంలోని సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పదవీ కాలం ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషన్‌ వేశారు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు కోరారు. అలాగే ప్రత్యేక అధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే తమకు మరో ఆరు నెలలు అవకాశం ఇచ్చి, పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించాలని సర్పంచులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోలేదు.
ఆరు నెలల తర్వాతే..
ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలవనుండగా మరో ఆరు నెలల తర్వాతనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలన కొనసాగనున్నారు.  ఇదిలా ఉండగా ఇదే సంవత్సరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments