నిలకడగా అనుషా ఆరోగ్యం..
స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్: ప్రేమించాలంటూ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది మహ్మద్ అజహర్ ను శనివారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఇంట్లో ఉన్న విద్యార్థిని అనూషపై అజహర్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనుషా ఎంజీఎం ఆర్ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రమే అజహర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు.
Recent Comments