Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్వామ్మో.. పత్తికి ఇంత ధర..?

వామ్మో.. పత్తికి ఇంత ధర..?

క్వింటాల్ కు రూ.11,170
రికార్డుల మీద రికార్డు
స్పాట్ వాయిస్, కాశీబుగ్గ: రికార్డ్.. రికార్డ్. తెల్లబంగారం ఆల్ టైమ్ రికార్డ్ ధరను సొంతం చేసుకుంది. శుక్రవారం ఏనుమాముల మార్కెట్ లో క్వింటాల్ కు రూ.11,170 పలికింది. మార్కెట్ చరిత్రలోనే క్వింటాల్‌ పత్తి ధర ఏకంగా రూ.11,170 పలికి ఆల్‌టైం రికార్డు క్రియేట్‌ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్‌ ఉండడంతో వ్యాపారులు పోటీ పడి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. పత్తి సీజన్‌ ముగింపు దశకు చేరుకోవడం సైతం ధర పెరగడానికి కారణంగా తెలుస్తోంది. శుక్రవారం ఏనుమాముల మార్కెట్ కు 200 బేళ్ల పత్తి రాగా.. గణపతి సాయి ట్రేడర్స్ వారు రూ.11,170 ఖరీదు చేసి కొనుగోలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments